Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. జూన్‌ 6,7,8 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.

Published : 13 Mar 2023 01:26 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా సైన్స్‌, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్‌ఎఫ్‌ అండ్‌ లెక్చర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతకు నిర్వహించే జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (NET) డిసెంబర్‌ 2022/జూన్‌ 2023కు ప్రకటన విడుదలైంది. ఈ మేరకు షార్ట్‌ నోటీస్‌ను  నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ శనివారం అర్ధరాత్రి విడుదల చేసింది.  సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంటారు. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రీసెర్చ్‌ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానూ ఎంపికయ్యేందుకు అవకాశం ఉంటుంది.

ముఖ్యాంశాలివే..

  • ఏప్రిల్‌ 10 సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
  • అప్లికేషన్‌ రుసుంను ఏప్రిల్‌ 10 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చు.
  • దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణ: ఏప్రిల్‌ 12 నుంచి 18 వరకు 
  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష పరీక్ష తేదీ: జూన్‌ 6,7,8; పరీక్ష సమయం 180 నిమిషాలు
  • ఈ పరీక్ష ఆబ్జెక్టివ్‌ తరహాలో ఆంగ్ల, హిందీ భాషల్లో ఉంటుంది. కోర్సు కోడ్‌, అర్హతకు కావాల్సిన సమాచారం, క్వశ్చన్‌ పేపర్‌లో సందేహాలు, ఫీజు తదితర వివరాలన్నింటినీ https://csirnet.nta.nic.inలో చెక్‌ చేసుకోవాలి.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని