Amaravati: లింగమనేని రమేష్ నివాసం జప్తు పిటిషన్‌పై జూన్‌ 2న తీర్పు

ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది.

Published : 31 May 2023 19:26 IST

అమరావతి: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ నివాసాన్ని జప్తు చేసేందుకు అనుమతి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ పై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. జూన్ 2న దీనిపై మధ్యంతర ఉత్తర్వులిచ్చే అవకాశం ఉంది. రమేష్ ఇంటిని అటాచ్ చేయాలని కోరుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసిందని సీఐడీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం ముందు ఇంటిని అటాచ్ చేయాలని, దీనికి ప్రతివాదుల వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు తమ వాదనలు వినాలని కోరుతూ లింగమనేని రమేష్  తరపు న్యాయవాది మెమో దాఖలు చేశారు. ఈనెల 17న ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తమకు కాపీలను అందజేయాలని న్యాయవాది కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును జూన్ 2కు వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని