Chandrababu: ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేసింది. 

Updated : 03 Oct 2023 16:59 IST

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో తెదేపా అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్‌గా వాదనలు వినిపించారు. ఆ తర్వాత సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు కొనసాగించారు. ఏజీ వాదనలకు లూథ్రా కౌంటరు వాదనలు వినిపిస్తూ.. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ముగించిన ఉన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని