TG News: తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రితో జూడాల చర్చలు అసంపూర్ణం

తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రితో జరిపిన చర్చలు అసంపూర్ణంగా ముగిసినట్లు జూనియర్‌ వైద్యులు వెల్లడించారు.

Updated : 24 Jun 2024 17:19 IST

హైదరాబాద్‌: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ జూనియర్‌ డాక్టర్లు(జూడాలు) రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  సోమవారం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రితో జూడాలు చర్చలు జరిపారు. అయితే, ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని జూడాలు వెల్లడించారు. కొన్ని అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని, మరికొన్ని అంశాలపై మరోసారి చర్చించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆయా అంశాలపై ప్రతిపాదనలను మంత్రి ఉన్నతాధికారులకు పంపించినట్లు జూడాలు తెలిపారు. 

వైద్యుల భద్రత గురించి మంత్రి ఆలోచిస్తామన్నారని, స్టైఫండ్‌కు గ్రీన్‌ఛానల్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు జూడాలు తెలిపారు. సమ్మె కొనసాగింపుపై రాష్ట్రస్థాయి జూడాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు సమ్మె యథాతథంగా కొనసాగిస్తామని చెప్పారు. గ్రీన్‌ ఛానల్‌ ఏర్పాటు చేసి ప్రతినెలా స్టైఫండ్‌ చెల్లింపు, సూపర్‌ స్పెషాలిటీ సీనియర్‌ రెసిడెంట్‌లకు రూ.1.25 లక్షల గౌరవ వేతనం, వైద్యకళాశాలలో పెంచిన 15 శాతం సీట్లలో ఏపీ విద్యార్థులకు అవకాశం ఇవ్వకూడదని, వైద్యులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలనే పలు డిమాండ్లతో జూడాలు సమ్మె చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని