Hyderabad: ఉస్మానియాలో కళ్లకు గంతలతో జూనియర్‌ వైద్యుల నిరసన

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Updated : 22 Jun 2024 16:43 IST

హైదరాబాద్‌: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియా మెడికల్‌ కళాశాల జూనియర్‌ డాక్టర్లు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కళ్లకు గంతలు కట్టుకొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీపాంకర్‌ మాట్లాడుతూ.. ‘‘అధికారుల చుట్టూ తిరగకుండా ప్రతి నెలా నిర్దిష్టమైన తేదీకి స్టైఫండ్‌ ఇవ్వాలని ఎప్పటి నుంచో కోరుతున్నాం. కానీ, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఉస్మానియా ఆసుపత్రి భవనం మూసి వేసి నాలుగేళ్లు అయ్యింది. పక్కనే ఉన్న మరో భవనంలోకి ఆసుపత్రి మార్చారు. విపరీతమైన రద్దీ కారణంగా ఇన్‌ఫెక్షన్ల శాతం పెరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి  మా డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలి’’ అని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని