Hyderabad: గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె

సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది.

Published : 24 Jun 2024 12:16 IST

సికింద్రాబాద్: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల నిరవధిక సమ్మె ప్రారంభమైంది. అత్యవసర సేవలు మినహా ఓపీ, వార్డు విభాగాల వైద్య సేవలు నిలిపివేసినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. పలు డిమాండ్లతో ఇప్పటికే సమ్మె నోటీసు ఇచ్చిన జూడాలు గాంధీ ఆసుపత్రిలో సమ్మెకు శ్రీకారం చుట్టారు. ఆసుపత్రి బయట ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. సకాలంలో స్టైఫండ్, సూపర్ స్పెషాలిటీ సీనియర్ వైద్యులకు గౌరవ వేతనం, ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల భద్రత, నీట్‌లో 15 శాతం రిజర్వేషన్ తెలంగాణ విద్యార్థులకు కేటాయించడం, ఆసుపత్రిలో మౌలిక వైద్య సదుపాయాలు మెరుగు పర్చడం, నూతన వసతి గృహాల నిర్మాణాలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవట్లేదని జూనియర్‌ డాక్టర్లు అసహనం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని