Junior doctors protest: జూడాల సమ్మెకు తాత్కాలిక బ్రేక్‌

తెలంగాణలో జూనియర్‌ డాక్టర్లు సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు.

Updated : 26 Jun 2024 07:42 IST

హైదరాబాద్‌: సమ్మెను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూనియర్‌ డాక్టర్లు (జూడా) ప్రకటించారు. డీఎంఈ, ఆరోగ్య శాఖ అధికారులతో మంగళవారం అర్ధరాత్రి వరకు వారు చర్చలు జరిపారు. ఈక్రమంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో జూడాల వసతి భవనాల ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకతీయ వర్సిటీలో రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని తెలిపింది. బుధవారం ఇందుకు సంబంధించి రెండు జీవోలు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. జీవోలు విడుదల కాకపోతే మళ్లీ సమ్మె కొనసాగిస్తామని జూడాలు స్పష్టం చేశారు. గ్రీన్‌ ఛానల్‌ ద్వారా ప్రతినెలా స్టైపెండ్‌ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్‌ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని