Jupiter: గురు గ్రహం చుట్టూ 12 కొత్త ఉపగ్రహాలు

సౌరకుటుంబంలోనే అతిపెద్దదైన గురు గ్రహం చుట్టూ కొత్తగా 12 ఉపగ్రహాలు చేరాయి. 

Published : 04 Feb 2023 01:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గురుడి చుట్టూ 12 కొత్త సహజ ఉపగ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వాషింగ్టన్‌లోని కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్‌ సైన్స్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త స్కాట్‌ షెపర్డ్‌ నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మైనర్‌ ప్లానెట్ సెంటర్‌ దీనిని నిర్ధారించింది. అయితే ఈ ఉపగ్రహాలన్నీ చాలా చిన్నవిగా ఉన్నాయని వాటికి పేర్లు పెట్టడం కష్టమని తెలిపింది. అవి గురుడికి చాలా దూరంలో ఉండడం వల్ల గురుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 340 నుంచి 550 రోజులు పడుతుందని తెలిపింది.  గురుడికి సమీపంలో ఉన్న మిగతా గ్రహాలకు వ్యతిరేక దిశలో కొత్తగా కనుగొన్న 9 ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయని వెల్లడించింది.

సౌరకుటుంబంలోనే అతిపెద్దదైన గురు గ్రహం చుట్టూ ప్రస్తుతం 92 ఉపగ్రహాలు పరిభ్రమిస్తున్నాయి. దీంతో సౌర కుటుంబంలో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన శని (83)గ్రహాన్ని గురుడు వెనక్కి నెట్టినట్లయింది. అంతరిక్షంలో భారీ ఖగోళ వస్తువులను ఢీకొట్టడం వల్ల ఏర్పడిన పెద్ద ఉపగ్రహాల అవశేషాలను చిన్న ఉపగ్రహాలుగా పరిగణిస్తారు. మరింత ఆధునిక పరికరాలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో చిన్న ఉపగ్రహాలను ఖగోళ శాస్త్రవేత్తలు కనిపెట్టే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని