TS news: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై వివరణ ఇవ్వండి: హైకోర్టు

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ వివాదంపై కేఏపాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వాదనలు విన్న ధర్మాసనం మాస్టర్‌ప్లాన్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Updated : 30 Jan 2023 18:53 IST

హైదరాబాద్‌: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ వివాదంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. మాస్టర్‌ ప్లాన్‌లోని అభ్యంతరాలపై కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. రైతులను సంప్రదించకుండానే మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ కూడా దీనిని రద్దు చేసిందని కోర్టుకు తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ రద్దుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరారు. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 13కి వాయిదా వేసింది.

కామారెడ్డిలోని కొన్ని గ్రామాల పొలాలను ఇండస్ట్రియల్‌ జోన్‌ పరిధిలోకి తెచ్చారంటూ బాధిత రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. మాస్టర్‌ ప్లాన్‌లో సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలగించాలంటూ డిమాండ్‌ చేస్తూ జిల్లా కేంద్రంలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని