Andhra news : సీఎం జగన్‌ స్పందించకపోతే.. ఆత్మహత్యే శరణ్యం!

ముఖ్యమంత్రి జగన్‌ స్పందించి న్యాయం చేయకపోతే తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోక తప్పదని మైదుకూరు మండలం పప్పనపల్లె గ్రామపంచాయతీ ఓబుళాపురం వైకాపా నేత మూలే వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో...

Updated : 28 Jan 2022 15:46 IST

కడప: ముఖ్యమంత్రి జగన్‌ స్పందించి న్యాయం చేయకపోతే తన కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోక తప్పదని మైదుకూరు మండలం పప్పనపల్లె గ్రామపంచాయతీ ఓబుళాపురం వైకాపా నేత మూలే వెంకట్రామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తన డీలర్‌షిప్‌ను కక్షపూరితంగా కొంతమంది స్థానిక వైకాపా నేతలే రద్దు చేయించారని ఆరోపించారు. గ్రామంలో చిన్న చిన్న పనులు కూడా  కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ పార్టీ కోసం కష్టపడితే చివరకు తనకు అన్యాయం చేశారు. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం ముఖ్యమంత్రికి చేరాలి. అకారణంగా తొలగించిన డీలర్‌షిప్‌ తిరిగి తనకు ఇప్పించాలి’’ అని అన్నారు. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.తన లాంటి వైసీపీ కార్యకర్తలెవ్వరికీ అన్యాయం జరగకూడదని విజ్ఞప్తి చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని