వరంగల్‌లో కాకతీయ వైభవ సప్తాహం.. మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు ఘనస్వాగతం

తెలంగాణలో కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైంది. రాష్ట్రంతో శతాబ్దాల అనుబంధమున్న కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టతలను భావితరాలకు తెలిపే...

Updated : 07 Jul 2022 11:48 IST

వరంగల్‌: తెలంగాణలో కాకతీయ వైభవ సప్తాహం ప్రారంభమైంది. రాష్ట్రంతో శతాబ్దాల అనుబంధమున్న కాకతీయుల చరిత్ర, పాలనా వైభవం, కళావిశిష్టతలను భావితరాలకు తెలిపే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి 7 రోజుల పాటు వరంగల్‌, హైదరాబాద్‌లలో కాకతీయ వైభవ సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. వరంగల్‌లో ఈ ఉత్సవాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రారంభించారు. 

కాకతీయుల వారసుడు మహారాజా కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌ ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం వద్ద ఆయనకు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ వినయ్‌ భాస్కర్‌, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌, జిల్లా అధికారులు ఘనస్వాగతం పలికారు. భద్రకాళి ఆలయ స్వాగత ద్వారం నుంచి ఆలయం వరకు డప్పు, డోలు కళాకారులు, పేరిణి నృత్య కళాకారులు కమల్‌చంద్ర భంజ్‌దేవ్‌కు స్వాగతం పలికారు. అనంతరం వేయిస్తంభాల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా కాకతీయ వైభవంపై ఏడురోజుల పాటు నాటకాలు, సదస్సులు, విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని