Kaloji University: కాళోజీ వర్సిటీ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌

Updated : 12 Mar 2022 06:48 IST

హైదరాబాద్: తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ జారీ చేసింది. యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 12వ తేదీ నుంచి 14 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవాలని తెలిపింది. వర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు ఒకేసారి వెబ్‌ఆప్షన్లు నమోదు చేసేలా అవకాశం కల్పించింది. అన్ని కౌన్సెలింగ్‌లకు వెబ్‌ ఆప్షన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపులు ఉంటాయని.. అందువల్ల ప్రాధాన్యతా క్రమంలో ఆప్షన్లు నమోదు చేసుకోవాలని వర్సిటీ సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని