Kamareddy: ‘మాస్టర్ ప్లాన్’ రగడ.. హైకోర్టును ఆశ్రయించిన కామారెడ్డి రైతులు

కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్‌కు లాయర్‌ ద్వారా నోటీసులిచ్చారు.

Published : 07 Jan 2023 12:21 IST

కామారెడ్డి: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై బాధిత రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్‌కు లాయర్‌ ద్వారా నోటీసులిచ్చారు. తాజాగా మాస్టర్‌ ప్లాన్‌పై పలువురు రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మిగిలిన రైతులు కూడా హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ఆందోళన ఘటనకు సంబంధించి భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు మరో ఎనిమిది మందిపై దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భాజపా నేతలు ఏనుగు రవీందర్‌రెడ్డి, వెంకట రమణారెడ్డిలపైనా కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. 

పట్టణ నూతన మాస్టర్‌ప్లాన్‌ను వ్యతిరేకిస్తూ.. వెంటనే రద్దు చేయాలని గత నెల రోజులుగా రైతులు నిరసన కార్యక్రమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సాగు భూములను పరిశ్రమల జోన్‌ నుంచి తొలగించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు