Kamareddy: కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌ వివాదం.. కార్యాచరణ ప్రకటించిన ఐకాస

కామారెడ్డి పట్టణ బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)  వివాదంపై బాధిత రైతుల ఐకాస భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది.

Updated : 08 Jan 2023 12:58 IST

కామారెడ్డి: కామారెడ్డి పట్టణ బృహత్‌ ప్రణాళిక(మాస్టర్‌ ప్లాన్‌)  వివాదంపై బాధిత రైతుల ఐకాస భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించింది. సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో నిర్వహించిన సమావేశానికి ఏడు విలీన గ్రామాల రైతులు హాజరయ్యారు. మాస్టర్‌ప్లాన్‌పై ఎమ్మెల్యే గంప గోవర్దన్‌, కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ చేసిన ప్రకటనలపై చర్చించారు. 

పార్టీలకు అతీతంగా 49మంది మున్సిపల్‌ కౌన్సిలర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 10న ఆందోళనకు విరామం ప్రకటించారు. ఈనెల 11న మున్సిపాలిటీ వద్ద ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని రైతులు నిర్ణయం తీసుకున్నారు. పంట పొలాలను ఇండస్ట్రియల్‌ జోన్‌ పరిధిలోకి తెచ్చారని బాధిత రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని