కనకదుర్గ పైవంతెన ప్రజల చిరకాల స్వప్నం

కనకదుర్గ పైవంతెనతో విజయవాడవాసుల చిరకాల స్వప్నం సాకారమైందని ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సహకారంతోనే ఈ వంతెన సిద్ధమైందని, వీడియో కాన్షరెన్స్‌ ద్వారా ఆయనే ప్రారంభిస్తారని చెప్పారు.

Published : 24 Aug 2020 22:52 IST

విజయవాడ: కనకదుర్గ ఆలయం వద్ద పైవంతెనతో విజయవాడ వాసుల చిరకాల స్వప్నం సాకారమైందని ఎంపీ కేశినేని నాని అన్నారు. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సహకారంతోనే ఈ వంతెన సిద్ధమైందని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయనే ప్రారంభిస్తారని చెప్పారు. నిర్మాణం పూర్తి చేసుకున్న వంతెనను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రాంతీయ అధికారి ఎస్‌కే సింగ్‌, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి నాని పరిశీలించారు. ఒకవైపు సాంకేతికత, మరోవైపు ప్రకృతి అందాలతో మిళితమైన ఈ ఫ్లైఓవర్‌తో విజయవాడ వాసుల కల నెరవేరిందని చెప్పారు. సెప్టెంబర్‌ 4న గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా దిల్లీ నుంచి ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. దీని నిర్మాణం చేపట్టిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గడ్కరీ, కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని