Kandula Durgesh: ఏపీలో స్టూడియోల నిర్మాణానికి ముందుకు రావాలి: మంత్రి కందుల దుర్గేష్‌

అద్భుతమైన ప్రకృతి వనరులు ఉన్న రాష్ట్రం ఏపీ అని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

Updated : 20 Jun 2024 21:29 IST

అమరావతి: అద్భుతమైన ప్రకృతి వనరులు ఉన్న రాష్ట్రం ఏపీ అని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అధికార యంత్రాంగంతో కలిసి రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని వెల్లడించారు. పర్యాటకశాఖ మంత్రిగా సచివాలయం రెండో బ్లాక్‌లో కందుల దుర్గేష్‌ బాధ్యతలు చేపట్టారు.

ఎకో టూరిజం, టెంపుల్‌ టూరిజం, అడ్వెంచర్‌ టూరిజం వంటి వాటిని విస్తృతంగా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలుగా విరాజిల్లాల్సిన ప్రాంతాలను వైకాపా ప్రభుత్వం విస్మరించిందన్నారు. అదృష్టవశాత్తూ రాష్ట్ర ప్రజానీకం వైకాపాకి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. పర్యాటక రంగాన్ని ఉపయోగించుకొని నిధులు సమకూర్చుకునే విధంగా ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. కోనసీమ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అనేక సినిమా షూటింగ్‌లు జరిగాయని, రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. సినిమా షూటింగ్‌లు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఏపీలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని నిర్మాతలకు ఆహ్వానం పలికారు. రాబోయే రోజుల్లో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని