Kanipakam: కాణిపాకంలో అభిషేకం టికెట్‌ ధరల వివాదం.. ఈవోపై బదిలీ వేటు

అభిషేకం టికెట్‌ ధరల వివాదం నేపథ్యంలో కాణిపాకం ఆలయ ఈవోపై బదిలీ వేటు పడింది.  కాణిపాకం  ఆలయ ఈవోగా కర్నూలు ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్‌ రాణా ప్రతాప్‌ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 08 Oct 2022 01:11 IST

కాణిపాకం: అభిషేకం టికెట్‌ ధరల వివాదం నేపథ్యంలో కాణిపాకం ఆలయ ఈవోపై బదిలీ వేటు పడింది. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ ఈవోగా కర్నూలు ఇన్‌ఛార్జి డిప్యూటీ కమిషనర్‌ రాణా ప్రతాప్‌ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ హరి జవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడ ఇన్‌ఛార్జి ఈవోగా పనిచేస్తున్న సురేష్‌బాబును రాజమహేంద్రవం ఆర్జేసీ(రీజినల్‌ జాయింట్‌ కమిషనర్‌)గా బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. స్వామివారి ఆలయంలో అభిషేకం టికెట్‌ ధరను రూ.700 నుంచి ఏకంగా రూ.5వేలకు పెంచాలని దేవాదాయశాఖ అనమతి లేకుండా నిర్ణయం తీసుకొని ప్రజాభిప్రాయ సేకరణకు నోటీసు బోర్డులో పెట్టడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో సురేష్‌బాబును ఇక్కడి నంచి బదిలీ చేస్తూ దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని