Karate Kalyani: దత్తత విచారణ ముగిసింది.. నాకు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు : కరాటే కల్యాణి

దత్తపుత్రిక విషయమై సీడబ్ల్యూసీతో సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) విచారణ ముగిసింది.

Published : 18 May 2022 16:48 IST

హైదరాబాద్‌: దత్తపుత్రిక విషయమై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌తో సినీ నటి కరాటే కల్యాణి (Karate Kalyani) విచారణ ముగిసింది. సమగ్ర విచారణ అనంతరం సంబంధిత అధికారులు కల్యాణి దగ్గర ఉన్న చిన్నారిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. వీరు రంగారెడ్డి జిల్లాకు చెందినవారు కావడంతో కేసును అక్కడి అధికారులకు బదిలీ చేశారు. చిన్నారులను దత్తత తీసుకునే విషయంలో అందరూ ప్రభుత్వ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. అనంతరం, కల్యాణి మీడియాతో మాట్లాడారు. దత్తత తీసుకోవాలనుకుంటే న్యాయపరంగానే తీసుకుంటానని తెలిపారు. పాపను దత్తత తీసుకోలేదన్నారు. ఆ పాప తల్లిదండ్రులే తనతోపాటు ఉంటున్నారన్నారు. విచారణ పూర్తయిన తర్వాత అధికారులు తనకు క్లీన్‌ చిట్‌ ఇచ్చినట్టు తెలిపారు. రెండు రోజుల నుంచి తనపై అనేక ఆరోపణలు వచ్చాయని, తన తల్లి, తమ్ముడు ఆత్మహత్య చేసుకుంటామన్నారని, వారికి ధైర్యం చెప్పానని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన వారిలో కొందరు రాజకీయనాయకులు, అధికారులు ఉన్నారన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై త్వరలోనే కోర్టుకు వెళ్లనున్నట్టు చెప్పారు.

కల్యాణి అక్రమంగా చిన్నారులను దత్తత తీసుకోవడం, కొనుగోలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతున్నారంటూ చైల్డ్‌లైన్‌ టోల్‌ఫ్రీ నం.1098కు ఫిర్యాదు అందగా సంబంధిత అధికారులు, పోలీసులు ఆమె ఇంటిని ఇటీవల సోదా చేసిన సంగతి తెలిసిందే. తాను ఆ పాపను దత్తత తీసుకోలేదని,  తనను కేసులో ఇరికించేందుకు కొందరు కుట్రపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించిన కల్యాణి మంగళవారం విచారణ నిమిత్తం సీడబ్ల్యూసీ కార్యాలయానికి వెళ్లగా అధికారులు లేకపోవడంతో బుధవారం మరోసారి హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని