Karate Kalyani: నేను పారిపోయే రకం కాదు.. పరిగెత్తించే రకం: కరాటే కల్యాణి

తాను అన్యాయాన్ని సహించనని.. చాలా మందిని ప్రశ్నిస్తున్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని సినీనటి కరాటే కల్యాణి అన్నారు. చిన్నారి దత్తత అంశంలో కొన్ని మీడియా

Published : 17 May 2022 01:47 IST

హైదరాబాద్‌: తాను అన్యాయాన్ని సహించనని.. చాలా మందిని ప్రశ్నిస్తున్నందునే తనపై ఆరోపణలు చేస్తున్నారని సినీనటి కరాటే కల్యాణి(Karate Kalyani) అన్నారు. చిన్నారి దత్తత అంశంలో కొన్ని మీడియా ఛానళ్లలో ‘పిల్లల్నీ ఎత్తుకెళ్లారు’ అంటూ టైటిల్స్‌ పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో చిన్నారి తల్లిదండ్రులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో కల్యాణి మాట్లాడారు. 

సినిమా వాళ్లకి చిన్నారిని అమ్ముకున్నాననే వార్తల్లో వాస్తవం లేదన్నారు. తాను ఎక్కడికీ పారిపోలేదని.. తనపై కొన్ని ఛానళ్లలో వస్తున్న వార్తలు చూసి చాలా బాధపడ్డానన్నారు. తన వద్ద ఉంటున్న చిన్నారి మౌక్తికను ఇంకా దత్తత తీసుకోలేదని.. కానీ, ఆ ప్రాసెస్‌ను చేద్దామనుకుంటున్నట్లు స్పష్టం చేశారు. పాప వయసు ఇంకా ఏడాది కూడా పూర్తి కాకపోవడంతో న్యాయపరంగా చెల్లుబాటు కానందున ఇంకా దత్తత తీసుకోలేదని చెప్పారు. తాను పారిపోయే రకం కాదని.. పరిగెత్తించే రకం అని వ్యాఖ్యానించారు. నిజం నిలకడగా తెలుస్తుందన్నారు.

‘‘నేను మా అమ్మతో కలిసి ఉండను. ఆమె అప్పుడప్పుడూ వచ్చి వెళ్తుంటారు. అందుకే మా అమ్మకి ఏ విషయాలూ తెలియవు. పాపను తీసుకుని యూట్యూబర్‌ శ్రీకాంత్‌రెడ్డిని కొట్టడానికి వెళ్లలేదు. అది అనుకోకుండా జరిగింది. శివశక్తి అనే సంస్థ ఇదంతా చేస్తోంది. ఈ విషయంలో కలెక్టర్‌ నుంచి నాకు ఎలాంటి నోటీసులు అందలేదు. మంగళవారం అధికారులను కలుస్తా. నా దగ్గర ఉన్న బాలుడిని కోళ్ల గూడులో పడేస్తే పెంచాను. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తున్నాను. మంచి పనులు చేసినా ఇలా కించపరుస్తారా? నాకు చాలా మంది శత్రువులు ఉన్నారు. కావాలనే నాపై ఇలా కేసులు పెట్టి ఫిర్యాదులు చేసి వేధిస్తున్నారు’’ అని కరాటే కల్యాణి ఆరోపించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని