Published : 26 Jul 2020 17:53 IST

కార్గిల్‌ అమరవీరుడి కేసుపై హెచ్‌ఆర్‌సీ విచారణ

హైదరాబాద్‌: కార్గిల్‌ యుద్ధంలో వీరమరణం పొందిన విజయ్‌బాబు కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. సంగారెడ్డికి చెందిన విజయ్‌బాబు సైన్యంలో చేరి కార్గిల్‌ యుద్ధంలో మరణించాడు. అయితే రెండు దశాబ్దాలు గడిచినా విజయ్‌బాబు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. దీంతో విజయ్‌ బాబు కుటుంబసభ్యుల పరిస్థితి చూసి ఈ కేసులు మానవహక్కుల సంఘం సుమోటోగా తీసుకుంది. విచారణ జరిపి ఆగస్టు 27లోగా నివేదిక ఇవ్వాలని సంగారెడ్డి కలెక్టర్‌, సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శిని ఆదేశించింది. కార్గిల్‌ విజయ్‌ దివస్‌ రోజే హెచ్‌ఆర్‌సీ కేసును స్వీకరించడం గమనార్హం.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని