తబలా వాయించి.. గిన్నిస్‌కు ఎక్కి..!

భారతీయ సంగీతంలో తబలా వాద్యం ప్రత్యేకమైంది. ఈ తబలాను నేర్పుగా వాయిస్తూ అందరి చేత ఔరా అనిపిస్తున్నారు కర్ణాటకకు చెందిన చేతన్‌కుమార్‌. తబలాను వాయించడంలో విశేష ప్రతిభ గడించిన చేతన్‌ ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏకధాటిగా 4గంటల పాటు తబలా వాయించి గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించారు.

Published : 11 Oct 2020 00:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ సంగీతంలో తబలా వాయిద్యం ప్రత్యేకమైంది. ఈ తబలాను నేర్పుగా వాయిస్తూ అందరితోనూ ఔరా అనిపిస్తున్నారు కర్ణాటకకు చెందిన చేతన్‌కుమార్‌. తబలాను వాయించడంలో విశేష ప్రతిభ గడించిన చేతన్‌ ఇటీవల మహారాష్ట్రలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఏకధాటిగా 4గంటల పాటు తబలా వాయించి గిన్నిస్‌ రికార్డులో స్థానం సంపాదించారు.

ఆయన తబలా వాయిస్తుంటే ఆ సంగీతానికి అక్కడి ప్రేక్షకులంతా మంత్రముగ్ధులవ్వక తప్పదు. ఏటా ఆ రాష్ట్రంలో జరిగే హంపి, దారువాట్‌లాంటి అనేక ఉత్సవాల్లో చేతన్‌ పాల్గొని తన తబలా సంగీతంతో భక్తుల్ని అలరిస్తారు. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో ఇటీవల జరిగిన తాలానినాద్‌ కార్యక్రమంలో ఏకధాటిగా 4గంటల పాటు తబలా వాయించిన చేతన్‌ గిన్నిస్‌ రికార్డును నెలకొల్పారు. తబలాను వాయించడమే వృత్తిగా ఎంచుకున్న ఆయన తొలుత డా.అరవింద్‌కుమార్‌ వద్ద శిక్షణ పొందారు. తరువాత తుది మెరుగులు దిద్దుకొని మరింత రాటుదేలారు. తబలాను వాయించే విద్యలో ప్రావీణ్యం గడించిన చేతన్‌ తాను నేర్చుకున్న విద్యను పిల్లలకు ఉచితంగా నేర్పిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని