Farmers protest: రైతుల నిరసనలకు కాంగ్రెస్‌ నిధులిచ్చింది

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపడుతున్న ఆందోళనల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ.. దిల్లీ శివార్లలో, ఇతర ప్రాంతాల్లో చేపడుతున్న నిరసనలకు...

Updated : 18 Oct 2022 14:28 IST

కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై వివాదాస్పద వ్యాఖ్యలు

బెంగళూరు: కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనల విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ధరల పెంపు అంశంపై సోమవారం ఆయన అసెంబ్లీలో ప్రతిపక్షాలకు సమాధానం ఇస్తూ.. దిల్లీ శివార్లలో, పరిసర ప్రాంతాల్లో చేపట్టిన నిరసనలకు కాంగ్రెస్‌, దేశంలోని విదేశీ ఏజెంట్ల నుంచి నిధులు అందాయని ఆరోపించారు. ‘ఈ నిరసనలు దిల్లీ చుట్టే జరిగాయి. మరెక్కడా జరగలేదు. ఎందుకంటే మీరు అక్కడ వాటికి స్పాన్సర్‌ చేశార’ని అన్నారు. కమీషన్ ఏజెంట్లూ వీటి వెనుక ఉన్నారని.. దేశ ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని కాంగ్రెస్‌నుద్దేశంచి వ్యాఖ్యానించారు. దీంతో సీఎం వ్యాఖ్యలను ఖండిస్తూ.. కాంగ్రెస్‌ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇలా మాట్లాడటం.. రైతులను అవమానించడమేనన్నారు. వెంటనే వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అత్యంత బాధ్యతారహితమైన వ్యాఖ్య అని ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమర్శించారు. ఒకవేళ కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే బాధ్యులను అరెస్ట్ చేయాలని సవాల్‌ విసిరారు. ద్రవ్యోల్బణం, వంట గ్యాస్‌, పెట్రో ధరల పెరుగుదల తదితర అంశాలపై ప్రశ్నించగా.. అడగని వాటికి సమాధానం ఇచ్చారన్నారు. పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా కేపీసీసీ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ తదితరులు విధాన సౌధ (అసెంబ్లీ) వరకు సైకిళ్లపై వచ్చారు. ఈ పరిణామాలతో భాజపా, కాంగ్రెస్‌ మధ్య వాతావరణం వేడెక్కింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని