పక్షులపై ప్రేమతో జొన్న పంట!

మనం వేసిన పంటలో ఒక్క పిట్ట కూడా వాలొద్దని దిష్టిబొమ్మలు పెడతాం. డప్పు చప్పుళ్లు చేసి తరిమేస్తాం. కానీ కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం తన పొలంలో ఎన్ని పక్షులొస్తే అంత ఆనందిస్తాడు. ఆయన పంట వేసిందే పక్షుల కోసం. వినడానికి కొత్తగా ఉన్నా... మూడెకరాల జొన్న పంటను పక్షులకే అంకితం చేశాడు ఆ బర్డ్‌మాన్‌.

Published : 11 Aug 2020 09:21 IST

దేవనగరె: మనం వేసిన పంటలో ఒక్క పిట్ట కూడా వాలొద్దని దిష్టిబొమ్మలు పెడతాం. డప్పు చప్పుళ్లు చేసి తరిమేస్తాం. కానీ కర్ణాటకకు చెందిన ఓ రైతు మాత్రం తన పొలంలో ఎన్ని పక్షులొస్తే అంత ఆనందిస్తాడు. ఆయన పంట వేసిందే పక్షుల కోసం. వినడానికి కొత్తగా ఉన్నా.. మూడెకరాల జొన్న పంటను పక్షులకే అంకితం చేశాడు ఆ రైతు. లాక్‌డౌన్‌ వేళ మనుషులే కాదు.. పశుపక్షాదులు కూడా ఆకలితో అలమటించాయి. టీవీ ఛానెళ్లలో అలాంటి వార్తను ఒకటి చూసి కర్ణాటక దేవనగరె జిల్లా శ్యామనూర్‌ గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌ కొంకాల చలించారు. పక్షులకు ఆహారం అందించి ఆదుకునేందుకు ఏదో ఒకటి చేయాలని భావించారు. సుమారు 40శాతం ఆదాయం పక్షుల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నారు.

పక్షులు, చిన్న చిన్న జంతువుల కడుపు నింపేందుకు తన మూడెకరాల పొలంలో  జొన్న పంట వేశారు. ఇప్పుడు ఆ పంట పచ్చగా విరబూసింది. దీంతో పిట్టలు, పిచ్చుకలు, గిజిగాడు వంటి పక్షులు ఆనందంగా విహరిస్తున్నాయి. కడుపారా జొన్నగింజలను ఆరగిస్తున్నాయి. ఆ పంటను కోస్తే సుమారు రూ.లక్ష వరకు ఆదాయం వస్తుంది. కానీ చంద్రశేఖర్ పక్షుల ఆహారం కోసం ఆ పంటను అలాగే ఉంచారు‌. ఆ ప్రదేశంలో కిలకిల రావాలు వినిపిస్తూ పక్షులు చూపరుల మనసును ఆకర్షిస్తున్నాయి. చాలా పక్షులు ఆ పంట పొలంలోనే గూళ్లు కట్టుకున్నాయి. వాటిని చూసేందుకు చంద్రశేఖర్‌ కుటుంబ సభ్యులు, స్థానికులు వీలైనప్పుడల్లా అటువైపు వెళ్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని