విమానాశ్రయ సిబ్బందికి టీకాలు

విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సిన్‌ను అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శనివారం సర్య్కులర్‌ జారీ చేశారు.

Published : 23 Jan 2021 23:20 IST

వారూ ఫ్రంట్‌లైన్‌ వర్కర్లేనన్న కర్ణాటక ప్రభుత్వం

బెంగళూరు: విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బందికి ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సిన్‌ను అందించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ శనివారం సర్య్కులర్‌ జారీ చేశారు. విమానాశ్రయాల్లో పనిచేసే సిబ్బందిని ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌గా గుర్తించి మొదటి దశలోనే వారికి వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలో కెంపెగౌడ, మంగళూరు, బెళగావి, హుబ్బళి-ధార్వాడ్‌, కలబురిగి, మైసూరు, బీదర్‌ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. విమానాశ్రయ సిబ్బందికి వ్యాక్సిన్‌ అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విమానాశ్రయాల్లో పనిచేసే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా ఇప్పటి వరకూ కర్ణాటకలో 1,38,656 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 2శాతం మందికి మాత్రమే స్వల్ప ఇబ్బందులు తలెత్తాయని ఆయన వెల్లడించారు.

ఇవీ చదవండి..

నన్ను అవమానించారు..మాట్లాడను

భారత్‌కు బ్రెజిల్‌ అధ్యక్షుడి వినూత్న కృతజ్ఞత

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని