అరుణాచలంలో వేడుకగా కార్తిక దీపోత్సవం

తమిళనాడులో పరమశివుడు అరుణ వర్ణ స్వరూపుడై కొలువుదీరిన అరుణాచల క్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ప్రతి ఏటా కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమి నాడు అరుణగిరిపై పరమశివుడు

Updated : 08 Dec 2022 15:41 IST

చెన్నై: తమిళనాడులో పరమశివుడు అరుణ వర్ణ స్వరూపుడై కొలువుదీరిన అరుణాచల క్షేత్రంలో కార్తిక పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఏటా కృత్తికా నక్షత్రయుక్త పౌర్ణమి నాడు అరుణగిరిపై పరమశివుడు అఖండ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తుల విశ్వాసం. ఈ క్రమంలో ఆదివారం కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పుణ్యక్షేత్రంలో స్వామి వారి ఊరేగింపును దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. ఈ సందర్భంగా అరుణాచల కొండలు పరమశివుడి నామస్మరణతో మారుమ్రోగాయి. అఖండ జ్యోతి రూపంలో పరమశివుడిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో పులకించిపోయారు.

ఇదీ చదవండి

జ్ఞానం శిలలుగా.. భక్తి నెలవుగా.. అరుణాచలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని