Telangana news: నా కుమారుడు కనిపించడం లేదు.. డీజీపీకి కేసీఆర్‌ అన్న కుమార్తె ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) అన్న కుమార్తె రమ్య రావు తన కుమారుడు కనిపించడం లేదంటూ డీజీపీ అంజనీ కుమార్‌ (Anjani Kumar)కు ఫిర్యాదు చేశారు. తన కుమారుడిని తీసుకెళ్లిన పోలీసులు అరెస్టు చేసినట్లు చూపించడం లేదని ఆమె పేర్కొన్నారు.

Updated : 25 Mar 2023 14:21 IST

హైదరాబాద్: తన కుమారుడు కనిపించకపోవడంపై డీజీపీ అంజనీకుమార్‌ (DGP Anjanikumar)తో చర్చించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్న కుమార్తె రమ్య రావు (Ramya Rao) డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. అయితే, లోపలికి వెళ్లకుండా అక్కడి సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రమ్య రావు.. అక్కడున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం వాళ్లు అనుమతించడంతో కార్యాలయం లోపలికి వెళ్లి డీజీపీకి ఫిర్యాదు చేశారు.

తన కుమారుడిని పోలీసులు తీసుకెళ్లి అరెస్టు చేసినట్లు చూపించడం లేదంటూ రమ్యరావు ఆరోపించారు. తన కుమారుడి ఆచూకీ తెలపాలని డిమాండ్‌ చేశారు. అర్ధరాత్రి తనిఖీల పేరుతో ఇబ్బంది పెట్టారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలను పరిష్కరించాలని నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్ఎస్‌యూఐ) గురువారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. దీంతో ఎన్ఎస్‌యూఐ ముఖ్య నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వాళ్లను ఎక్కడ ఉంచారనే విషయం తెలియకుండా పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. అరెస్టయిన వారిలో రమ్యరావు కుమారుడు రితేశ్‌రావు కూడా ఉన్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని