CM KCR: ముంబయి బయలుదేరిన సీఎం కేసీఆర్‌

కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ముంబయి బయల్దేరారు.

Updated : 20 Feb 2022 12:05 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేక కూటమికి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ ముంబయి బయల్దేరారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ఠాక్రెతో ఈ మధ్యాహ్నం కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రగతి భవన్‌ నుంచి బేగంపేట విమానాశ్రయం చేరుకున్న కేసీఆర్‌.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబయి వెళ్లారు. సీఎంతో పాటు ఎమ్మెల్సీ కవిత, ఎంపీలు సంతోష్‌, రంజిత్‌రెడ్డి, బి.బి.పాటిల్‌, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శ్రవణ్‌కుమార్ ముంబయి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్, ఉద్ధవ్‌ ఠాక్రే చర్చించనున్నారు. ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్‌ కార్యాచరణపై భేటీలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని