కీసర తహసీల్దార్‌ కేసు: కస్టడీకి నలుగురు నిందితులు

వివాదాస్పద భూమి విషయంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన కీసర తహసీల్దార్‌ నాగరాజు కేసులో అనిశా దర్యాప్తు ముమ్మరం చేసింది.

Published : 24 Aug 2020 22:58 IST

హైదరాబాద్‌: వివాదాస్పద భూమి విషయంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన కీసర తహసీల్దార్‌ నాగరాజు కేసులో అనిశా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా నలుగురు నిందితులను ఏసీబీ కోర్టు కస్టడీలోకి అనుమతించింది. తహసీల్దార్‌ నాగరాజు, శ్రీనాథ్‌, అంజిరెడ్డి, వీఆర్‌ఏ సాయిరాజ్‌ను ఈ నెల 25 నుంచి 27 వరకు మూడు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది. న్యాయస్థానం అనుమతితో చంచలగూడ జైల్లో ఉన్న నలుగురు నిందితులను అనిశా అధికారులు కస్టడీలోకి తీసుకొని.. నాంపల్లిలోని అనిశా కార్యాలయంలో విచారించనున్నారు. ఈ కేసులో పట్టుబడిన రూ.కోటి పది లక్షలపై అధికారులు కూపీ లాగనున్నారు. అదేవిధంగా తహసీల్దార్‌ నాగరాజు సమక్షంలో బ్యాంక్‌ లాకర్‌ను తెరవనున్నారు. 

కోట్ల రూపాయల విలువైన భూమిని నిబంధనలకు విరుద్ధంగా స్థిరాస్తి వ్యాపారుల పేరు మీద మార్చడానికి తహసీల్దార్‌ నాగరాజు రూ.రెండు కోట్లు లంచం డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో స్థిరాస్తి వ్యాపారులు అంజిరెడ్డి, శ్రీనాథ్‌ కలిసి నాగరాజుకు రూ.కోటి 10లక్షలు లంచం ఇస్తుండగా పక్కా సమాచారంతో అనిశా అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు