Kendriya Vidyalaya: కేవీల్లో 13,404 పోస్టులకు దరఖాస్తు గడువు పొడిగింపు

కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా పోస్టులకు దరఖాస్తు చేసుకొనే వారికి గుడ్‌న్యూస్‌. దరఖాస్తు గడువు నేటితో ముగియనుండటంతో దాన్ని పొడిగిస్తున్నట్టు  కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ వెల్లడించింది. 

Published : 27 Dec 2022 01:10 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) భారీగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఇటీవల నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం 13,404 ఉద్యోగాలకు రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకొంటున్నారు. డిసెంబర్ 5న మొదలైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ నేటితో (డిసెంబర్ 26)తో ముగియనుండటంతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులకు ఉపశమనం కలిగించేలా దరఖాస్తు గడువును జనవరి 2 వరకు పొడిగిస్తున్నట్టు సోమవారం సాయంత్రం ఓ ప్రకటన జారీ చేశారు. విద్యార్హత, వయసు, పని అనుభవం తదితర విషయాల్లో ఎలాంటి మార్పులు లేవని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ జాయింట్‌ కమిషనర్‌ (అడ్మిన్‌-1) స్పష్టం చేశారు.

గమనించండి!

  • ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు పొడిగించిన తేదీ: జనవరి 2
  • పరీక్ష తేదీ: తర్వాత ప్రకటిస్తారు.
  • పరీక్ష కేంద్రాలు: ఏపీలో అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
  • తెలంగాణలో హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌.
  • దరఖాస్తు ఫీజు: పోస్టును బట్టి    రూ.1200-2300 వరకు చెల్లించాలి.
  • వెబ్‌సైట్‌: https://kvsangathan.nic.in/
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని