Tomato price: పత్తికొండ మార్కెట్లో కిలో టమాట రూపాయి.. పారబోసి రైతుల నిరసన
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో మంగళవారం సాయంత్రం టమాట ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. దీంతో ఆగ్రహించిన రైతులు తాము తెచ్చిన టమాటలను రహదారిపై పోసి నిరసన తెలిపారు.
పత్తికొండ గ్రామీణం: కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో మంగళవారం సాయంత్రం టమాట ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. నాలుగైదు రోజులుగా రూ.3, రూ.4 మధ్య ఊగిసలాడుతూ వచ్చిన ధరలు ఈరోజు కిలో రూ.1కి పడిపోయాయి. దీంతో ఆగ్రహించిన రైతులు తాము తెచ్చిన టమాటలను మార్కెట్ బయట పత్తికొండ-గుత్తి ప్రధాన రహదారిపై పోసి నిరసన తెలిపారు. ‘‘టమాట ధరలు తగ్గినప్పుడు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులకు మద్దతు ధర కల్పిస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు. గత 20రోజులుగా టమాట ధరలు పడిపోయినా ప్రభుత్వం కాని, అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విచారకరం. వ్యాపారుల మాయాజాలంతో రైతులు ఏటా నష్టాలు చవిచూస్తున్నారు’’ అని ఈ సందర్భంగా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి టమాటకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమల నడక మార్గంలో చిరుత సంచారం
అలిపిరి కాలిబాటలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26 తేదీల్లో ఇక్కడి నడక మార్గంలో చిరుత కదలికలు కనిపించాయి. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగనా సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్‌బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్‌కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్