Khairatabad Ganesh: కొనసాగుతున్న ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర

నగరంలో గణేశుడి మహా నిమజ్జనం సందడి మొదలైంది. హుస్సేన్‌సాగర్‌ సహా సుమారు 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది.

Updated : 28 Sep 2023 09:13 IST

హైదరాబాద్‌: నగరంలో గణేశుడి మహా నిమజ్జనం సందడి మొదలైంది. హుస్సేన్‌సాగర్‌ సహా సుమారు 100 ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్ర ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. ప్రస్తుతం సెన్సేషన్‌ థియేటర్‌ వరకు చేరుకుంది. భక్తుల జయజయధ్వానాల మధ్య బడా గణేశుడు ముందుకు సాగుతున్నాడు. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్‌సాగర్‌లో మహాగణపతి నిమజ్జనం పూర్తికానుంది.

కాసేపట్లో బాలాపూర్‌ గణపతి లడ్డూ వేలం

మరోవైపు బాలాపూర్‌ గణపతి గ్రామ ఊరేగింపు ప్రారంభమైంది. ఊరేగింపు అనంతరం ఉదయం 9.30 గంటలకు లడ్డూవేలం నిర్వహించనున్నారు. ఈ వేలంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు జరిగే బాలాపూర్‌- హుస్సేన్‌సాగర్‌ మార్గంలో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటించారు. రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు