ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నమూనా ఆవిష్కరణ

ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా (ఐదు తలలతో) దర్శనమివ్వనున్నారు. ఎడమ వైపు కాలనాగ దేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు

Updated : 18 Jul 2021 11:03 IST

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ ఈసారి పంచముఖ రుద్ర మహాగణపతిగా (ఐదు తలలతో) దర్శనమివ్వనున్నారు. ఎడమ వైపు కాలనాగ దేవత, కుడివైపు కృష్ణ కాళి విగ్రహాలు (15 అడుగులు) ఏర్పాటు చేయనున్నారు. గణేశ్‌ ఉత్సవ విగ్రహ నమూనాను ఖైరతాబాద్‌లోని వినాయక మండపం వద్ద కమిటీ సభ్యులు శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ ఏడాది 40 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని ఉత్సవ కమిటీ నిర్ణయించింది. గతేడాది కొవిడ్‌ నేపథ్యంలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని