Khairatabad Ganesh: ఈసారి ఖైరతాబాద్‌ మహా గణపతి ఎత్తు ఎంతంటే..?

ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్రపూజ నిర్వహించారు.

Published : 17 Jun 2024 17:47 IST

హైదరాబాద్‌: ఖైరతాబాద్‌ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్రపూజ నిర్వహించారు. ఈసారి 70 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ తెలిపారు. కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ‘‘ఖైరతాబాద్‌లో పర్యావరణహిత విగ్రహం ఏర్పాటు చేస్తాం. సంప్రదాయం ప్రకారం కర్రపూజ చేసి విగ్రహం ఏర్పాటు ప్రారంభించాం. గతంలో కంటే మెరుగ్గా ఉత్సవాలు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు అన్ని విభాగాలను సమాయత్తం చేస్తున్నాం. రాబోయే రెండుమూడు రోజుల్లో ఉత్సవ కమిటీలతో సమావేశమై చర్చిస్తాం. వచ్చిన ప్రతి భక్తుడికి ప్రసాదం ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం’’ నాగేందర్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని