హైకోర్టుకు క్షమాపణ చెప్పిన ఖమ్మం కలెక్టర్‌

హైకోర్టుకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ క్షమాపణ చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా సీజే జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం ఎదుట ఆయన

Updated : 11 Mar 2021 14:01 IST

హైదరాబాద్‌: హైకోర్టుకు ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్‌.వి.కర్ణన్‌ క్షమాపణ చెప్పారు. కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా సీజే జస్టిస్‌ హిమా కోహ్లి ధర్మాసనం ఎదుట ఆయన హాజరయ్యారు. ప్రభుత్వ పథకాల్లో అక్రమాలు జరుగుతున్నాయన్న వినతిపత్రాలపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఖమ్మం కలెక్టర్‌ అమలు చేయలేదు. దీంతో హైకోర్టు సింగిల్‌ జడ్జి కోర్టు ధిక్కరణ శిక్ష విధించారు. దీని కింద రూ.500 జరిమానా చెల్లించాలని ఆదేశించారు. సింగిల్‌ జడ్జి తీర్పు విషయంలో కలెక్టర్‌ దాఖలు చేసిన అప్పీలుపై ఈరోజు విచారణ జరిగింది. ఆయన క్షమాపణ చెప్పడంతో కోర్టు ధిక్కరణ శిక్షను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని