kishan reddy: హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్: కిషన్‌రెడ్డి
ఆరోగ్య పర్యాటకంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఆరోగ్య పర్యాటకంలో దేశాన్ని అగ్రభాగాన నిలిపేందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జీ 20 హెల్త్ వర్కింగ్ గ్రూప్‌నకు సంబంధించి మూడో సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రపంచానికే హైదరాబాద్ ఫార్మసీ, వ్యాక్సిన్ రాజధాని అని చెప్పారు. నాణ్యమైన వైద్య విధానాలు భారత్‌లో శతాబ్దాల క్రితమే ఉన్నాయన్నారు.
‘‘ఆయుర్వేదం 5వేల ఏళ్లనాటి వైద్యం. ఆయుర్వేదం ఆరోగ్యవంతమైన, సుదీర్ఘ జీవితానికి ఉపయోగపడుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని యోగా పెంపొందిస్తుంది. ఆయుర్వేదం, సిద్ద, యునానీ, యోగా వంటివి శతాబ్దాల క్రితమే ఉన్నాయి. హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్ ఒకటి. వ్యాక్సిన్లలో 33 శాతం భారత్‌లోనే తయారవుతున్నాయి. 2030నాటికి యూనివర్శల్ హెల్త్‌కేర్ కవరేజ్‌ని సాధించాలని కృషి చేస్తున్నాం’’ అని కిషన్‌రెడ్డి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Political news: పరిగి ఎమ్మెల్యేకి పితృవియోగం
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Rahul Gandhi: విద్వేష మార్కెట్లో ప్రేమ దుకాణం.. బీఎస్పీ ఎంపీని కలిసిన రాహుల్
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Guntur: వైకాపా దాడి చేస్తే.. తెదేపా దీక్షా శిబిరాన్ని తొలగించిన పోలీసులు
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!