Kishan Reddy: శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ యోగా: కిషన్‌రెడ్డి

యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

Updated : 21 Jun 2024 10:54 IST

హైదరాబాద్‌: యోగా అంటే శరీరాన్ని, మనసును కలిపే ప్రక్రియ అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన యోగా మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రాణులు ప్రకృతితో మమేకమవ్వడమే యోగా అంతరార్థమని తెలిపారు. ఇవాళ ప్రపంచమంతా యోగా వైపు చూస్తోందని చెప్పారు. యోగా అలవాటు చేసుకుంటే విజయాలన్నీ చేకూరతాయన్నారు. 

ప్రధానిగా మోదీ నిర్ణయాన్ని ప్రపంచమంతా ఆచరిస్తోందని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. మోదీ వల్ల యోగాకు అన్ని దేశాల్లో ప్రాముఖ్యత లభించిందని తెలిపారు. కులమతాలకు అతీతంగా అందరూ నేర్చుకోవాల్సిన విద్య యోగా అని వివరించారు. 

హైదరాబాద్‌లోని కన్హ శాంతివనంలో నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమలో తెలంగాణ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. వరంగల్‌లోని సీకేఎం కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో చినజీయర్‌ స్వామి పాల్గొన్నారు. కరీంనగర్‌లోని జ్యోతినగర్‌ మున్సిపల్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పాల్గొని యోగాసనాలు వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు