Updated : 04 Jul 2022 12:59 IST

Kishan Reddy: ఇచ్చిన మాట ప్రకారం మోదీ భీమవరం వచ్చారు: కిషన్‌రెడ్డి

భీమవరం: ఇచ్చిన మాట ప్రకారం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125 జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ భీమవరం వచ్చారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ప్రధానికి తెలుగు ప్రజల తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నామని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన అల్లూరి జయంత్యుత్సవ వేడుకల్లో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, అల్లూరి నడయాడిన ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ ఏడాదంతా అల్లూరి పేరు మారు మోగాలన్నారు. అల్లూరి సీతారామరాజు కుటుంబసభ్యులను కలుస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. 


Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని