Kishan Reddy: దేశీయంగా బొగ్గు ఉత్పత్తి పెంచుతాం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు.

Updated : 13 Jun 2024 19:38 IST

దిల్లీ: మోదీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్‌ అందిస్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోందని చెప్పారు. దిల్లీలో గురువారం ఆయన కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

‘‘మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుతాం. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తాం. బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖల అధికారులు ఒక బృందంగా నిబద్ధతతో పనిచేస్తాం’’ కిషన్‌రెడ్డి చెప్పారు.

బండి సంజయ్‌ బాధ్యతల స్వీకరణ

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు