TG News: గత ప్రభుత్వ తప్పిదాలపై క్రిమినల్‌ చర్యలకూ వెనుకాడొద్దు: కోదండరాం

భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ కొనసాగుతోంది.

Updated : 18 Jun 2024 16:24 IST

హైదరాబాద్‌: భద్రాద్రి, యాదాద్రి విద్యుత్‌ ప్లాంట్లు, ఛత్తీస్‌గఢ్‌ విద్యుత్‌ కొనుగోళ్ల వ్యవహారంపై జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. బీఆర్కే భవన్‌లో కమిషన్‌ కార్యాలయానికి తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం, విద్యుత్‌శాఖ అధికారి రఘు వచ్చారు. ఇద్దరి వద్ద కమిషన్‌ వివరాలు అడిగి తెలుసుకుంది. అనంతరం కోదండరాం మీడియాతో మాట్లాడారు.

‘‘గత ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలను సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. చట్టం ప్రకారం అందరం నడుచుకోవాలి. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించాలి. అభివృద్ధి అంటే ఒకరిద్దరికి లాభం చేయడం కాదు. గత ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్ల ట్రాన్స్‌కో, జెన్‌కోలకు రూ.81 వేల కోట్ల అప్పులయ్యాయి. భవిష్యత్‌లో గోదావరి వద్ద నీటి మట్టం పెరిగితే భద్రాద్రి ప్లాంట్‌ను కాపాడుకోగలమా?. గతేడాది వచ్చిన వరదలకు భద్రాద్రి ప్లాంట్‌లో విద్యుత్‌ ఉత్పత్తి ఆపేయాల్సి వచ్చింది. గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు తలెత్తాయి. ఆ తప్పిదాలపై క్రిమినల్‌ చర్యలకూ వెనుకాడవద్దు’’ అని కోదండరాం కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని