Published : 18 May 2022 22:11 IST

Andhra News: కోనసీమ జిల్లా పేరు మార్పు.. నోటిఫికేషన్‌ జారీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కోనసీమ జిల్లా పేరును మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా పేరును మార్పు చేసి నోటిఫికేషన్‌ ఇచ్చింది. పేరు మార్పుపై అభ్యంతరాలు, సూచనలు ఉంటే 30 రోజుల్లోగా తెలియజేయాలని ప్రాథమిక నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. సూచనలు, సలహాలను కోనసీమ జిల్లా కలెక్టర్‌కు 30 రోజుల్లోగా తెలియజేయాలని సూచించింది.

అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts