Andhra News: కోనసీమ జిల్లా పేరు మార్పు.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం!

కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Updated : 18 May 2022 15:48 IST

అమరావతి: కోనసీమ జిల్లా పేరు మారనుంది. ఆ జిల్లా పేరును డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై త్వరలోనే ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల కానుంది.

అమలాపురం కేంద్రంగా ఏర్పాటు చేసిన కోనసీమ జిల్లాకు డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరు పెట్టాలని దళిత, ప్రజాసంఘాలు, వివిధ పార్టీలు కోరాయి. దీనికోసం పలుచోట్ల ఆందోళన కార్యక్రమాలు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లా పేరులో డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ పేరును చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని