కొవిడ్‌ మార్గదర్శకాలను విధిగా పాటించాలి

పరిషత్ ఎన్నికల్లో కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.  ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థులు, రాజకీయ..

Updated : 03 Apr 2021 12:19 IST

ఉత్తర్వులు జారీ చేసిన ఎస్‌ఈసీ

విజయవాడ: పరిషత్ ఎన్నికల్లో కొవిడ్ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశిస్తూ ఎస్ఈసీ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రచారంలో పాల్గొంటున్న అభ్యర్థులు, రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ లో పోలీసు సిబ్బందికి, ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బందికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కేంద్ర హోం శాఖ ఉత్తర్వులకు అనుగుణంగా పోలింగ్ కేంద్రాలతో పాటు ప్రచారంలో విధిగా 6 అడుగుల భౌతిక దూరం పాటించాలని స్పష్టం  చేశారు.ముఖానికి మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు ఇతర అత్యవసర సామగ్రిని పోలింగ్ సిబ్బందికి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఓటింగ్ వేసే గదిలో ఒక్కసారికి ఒక్క ఓటరును మాత్రమే అనుమతించాలని స్పష్టం  చేశారు. ప్రచారంలో అభ్యర్థుల వెంట అయిదుగురు వ్యక్తులు కంటే ఎక్కువ మంది ఉండకూడదని ఎస్‌ఈసీ వెల్లడించారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని