Vijayawada: కృష్ణా నదికి పోటెత్తిన వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్నానఘట్టాల వద్దకు సందర్శకులను...

Updated : 12 Aug 2022 15:10 IST

విజయవాడ: ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్నానఘట్టాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. నదికి ఇరువైపులా పోలీసు పికెటింగ్‌ ఏర్పాట్లు చేశారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4.44లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  మరోవైపు విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. కృష్ణలంక, భూపేష్‌ గుప్తా కాలనీ, రామలింగేశ్వరనగర్‌ తదితర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని