
Krishnapatnam: ‘ఆనందయ్య మా పాలిట దేవుడు’
మందు పంపిణీకి గ్రీన్‌సిగ్నల్..కృష్ణపట్నం వాసులు ఆనందం
నెల్లూరు: ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత 30ఏళ్లుగా వివిధ రోగాలకు ఆనందయ్య మందులు వాడుతున్నామని.. ఎవరికీ ఏమీ కాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఆనందయ్య మందే తమకు శ్రీరామరక్ష అని.. ఆయన తమ పాలిట దేవుడని కొనియాడుతున్నారు.
కామెర్లు, టైఫాయిడ్, గ్యాస్ట్రబుల్ సహా అనేక రోగాలను ఆనందయ్య నయం చేశారని చెబుతున్నారు. కావాలనే ఆయనపై అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆనందయ్య మందు వాడిన వాళ్లెవరూ నష్టపోలేదన్నారు. మందు కోసం ఆయన వాడిన పదార్థాలన్నీ మన వంటింట్లో వాడే వస్తువులేనని చెప్పారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.