తెలుగు రాష్ట్రాలకు బస్సులు..  కర్ణాటక రైట్‌ రైట్‌!

లాక్‌డౌన్‌తో నిలిపివేసిన అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను కర్ణాటక ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేసిన కేఎస్‌ఆర్టీసీ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు ....

Published : 21 Jun 2021 16:05 IST

రేపట్నుంచే బస్సు సర్వీసులు పునరుద్ధరణ

బెంగళూరు:  లాక్‌డౌన్‌తో నిలిపివేసిన అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను కర్ణాటక ప్రభుత్వం మళ్లీ ప్రారంభించనుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతితో అంతర్‌ రాష్ట్ర బస్సు సర్వీసులను రద్దు చేసిన కేఎస్‌ఆర్టీసీ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ఏపీ, తెలంగాణకు రేపట్నుంచి ఆర్టీసీ బస్సులు నడపాలని నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి 50శాతం సీటింగ్‌ సామర్థ్యంతో బస్సులు నడపనున్నట్టు కేఎస్‌ఆర్టీసీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఆపరేషన్స్‌) ఓ ప్రకటనలో వెల్లడించారు. రేపు ఉదయం 6గంటల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు సర్వీసులు ప్రారంభమవుతాయని, అలాగే, ఏపీలో ఆంక్షలు కొనసాగుతుండటంతో సాయంత్రం 6గంటల కల్లా చేరుకొనేలా సర్వీసులు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 

బస్సుల్లో ప్రయాణించేవారంతా తప్పకుండా మాస్క్‌లు ధరించాలన్నారు. కరోనా నిబంధనలు ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రయాణాలకు సంబంధించి ముందస్తుగానే ఆన్‌లైన్‌ టిక్కెట్లను ksrtc.karnataka.gov.in లేదా www.ksrtc.in వెబ్‌సైట్లలో బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం కేఎస్‌ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్‌ 080-26252625ను సంప్రదించవచ్చన్నారు. 

కరోనా వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కొన్ని జిల్లాల్లో సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. అధిక పాజిటివిటీ రేటు ఉన్న 13 జిల్లాల్లో మాత్రం ఈ నెల 21 నుంచి జులై 5వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతుందని సీఎం యడియూరప్ప శనివారమే స్పష్టంచేసిన విషయం తెలిసిందే. 5శాతం కన్నా తక్కువ పాజిటివిటీ రేటు ఉన్న 19 జిల్లాల్లో సాయంత్రం 5గంటల వరకు అన్ని దుకాణాలూ సాయంత్రం 5గంటల వరకు తెరుచుకొనేందుకు అనుమతించారు. బస్సులు, మెట్రో రైల్‌ సర్వీసులు 50శాతం సామర్థ్యంతో సేవలు అందించేందుకు అవకాశం కల్పించారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని