KTR: కేటీఆర్‌ అమెరికా పర్యటన.. డిజిటెక్‌ సెంటర్‌ ఏర్పాటుకు ముందుకొచ్చిన కాల్‌ అవే సంస్థ

అమెరికాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్‌ బృందం అమెరికాలో పర్యటిస్తూ వివిధ కంపెనీలతో సమావేశం

Published : 22 Mar 2022 15:11 IST

హైదరాబాద్: అమెరికాలో మంత్రి కేటీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా కేటీఆర్‌ బృందం అమెరికాలో పర్యటిస్తూ వివిధ కంపెనీలతో సమావేశం అవుతోంది. తాజాగా హైదరాబాద్‌లో డిజిటెక్‌ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు అమెరికాకు చెందిన కాల్‌ అవే గోల్ఫ్‌ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు కేటీఆర్‌లో ఒప్పందం చేసుకున్నారు. టాప్‌ గోల్ఫ్‌ బ్రాండ్‌గా కాల్‌ అవే కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్‌లో కాల్ అవే నెలకొల్పనున్న డిజిటెక్ సెంటర్ ద్వారా కొత్తగా 300 మందికి ఉపాధి లభించే అవకాశాలున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. డిజిటెక్‌ సెంటర్‌తో పాటు గోల్ఫ్ ఉత్పత్తుల తయారీ కొరకు రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను కేటీఆర్‌ కోరారు. తెలంగాణలో స్పోర్ట్స్ టూరిజంలో భాగం కావాలని కంపెనీ ప్రతినిధులను కేటీఆర్‌ ఆహ్వానించారు.

ఫిస్కర్‌ సీఈఓతో భేటీ..

తన పర్యటనలో భాగంగా ఫిస్కర్‌ సంస్థ ఛైర్మన్, సీఈఓతో కేటీఆర్‌ బృందం సమావేశం అయింది. భేటీలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) విషయంలో రాష్ట్రం అవలంబిస్తోన్న విధానాలను ఫిస్కర్‌ సంస్థ ప్రతినిధులకు కేటీఆర్‌ వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాల్సిందిగా కోరారు. కేటీఆర్‌ ఆహ్వానం మేరకు ఫిస్కర్‌ సంస్థకు చెందిన బృందం త్వరలోనే హైదరాబాద్‌లో పర్యటించి పెట్టుబడుల పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పరిశీలించనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని