
Published : 26 Jan 2022 17:24 IST
KTR: సీసీఐ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిద్దాం: కేటీఆర్
హైదరాబాద్: ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న నేతృత్వంలోని బృందం కలిసింది. ఆదిలాబాద్ జిల్లా సమస్యలు, సీసీఐ పునరుద్ధరణపై మంత్రితో చర్చించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీసీఐ అంశంపై అవసరమైతే దిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామన్నారు. సీసీఐ సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిద్దామని సూచించారు. ఈ విషయంలో ఒత్తిడి తేవాలని భాజపా ఎంపీలను నిలదీద్దామన్నారు. త్వరలోనే ఆదిలాబాద్‌కు ఐటీ టవర్ మంజూరు చేస్తామని.. టెక్స్‌టైల్ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.
Tags :