KTR: ఫ్లోరోసిస్‌ బాధితుడు స్వామి మృతి.. కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి

నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి (32) మృతి పట్ల మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 28 Jan 2023 16:55 IST

చౌటుప్పల్‌: నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెంలో ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశాల స్వామి (32) శనివారం ఉదయం మృతిచెందాడు. ట్రై సైకిల్‌ పైనుంచి కింద పడి తలకు బలమైన గాయం కావడంతో మృతి చెందారు. ఈ వార్త తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామి మృతిపై ట్విటర్‌ వేదికగా కేటీఆర్‌ స్పందించారు. ‘‘స్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఫ్లోరోసిస్‌ నివారణ, బాధితుల కోసం పోరాటం చేసిన గొప్ప యోధుడు ఆయన. ఎంతో మందికి ఆయన ప్రేరణ. స్వామి ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’’ అని సంతాపం ప్రకటించారు.

గతంలో స్వామికి మంత్రి కేటీఆర్‌ ఇల్లు కట్టించారు. జీవనోపాధి కోసం ఆయనకు సెలూన్‌ ఏర్పాటు చేయించారు. మూడు నెలల క్రితం ఆయన ఇంటి గృహ ప్రవేశానికి కూడా కేటీఆర్‌ హాజరయ్యారు. ఆ సందర్భంగా దిగిన ఫొటోను కేటీఆర్‌ ట్విటర్‌లో షేర్‌ చేస్తూ మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు