తెలంగాణ ఉద్యమకారుడికి కేటీఆర్ సాయం

తొలితరం తెలంగాణ ఉద్యమాకారుడు డా. కొల్లూరి చిరంజీవికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని

Updated : 28 Feb 2021 13:24 IST

హైదరాబాద్: తొలితరం తెలంగాణ ఉద్యమాకారుడు డా. కొల్లూరి చిరంజీవికి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అండగా నిలిచారు. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించారు. చిరంజీవి కుటుంబసభ్యులతో స్వయంగా మాట్లాడిన కేటీఆర్‌.. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిరంజీవి వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందేలా చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి కూతురు అజిత, ఇతర కుటుంబసభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. డా. చిరంజీవి పుట్టినరోజునే ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబాన్ని కేటీఆర్ ఆదుకోవడం ఎప్పటికీ మరిచిపోలేమని కుటుంబసభ్యులు తెలిపారు.

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న డా.కొల్లూరి చిరంజీవిని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. 1969 ఉద్యమంలో కొల్లూరి చిరంజీవి కీలక పాత్ర పోషించారని ఈటల గుర్తు చేసుకున్నారు. కాకతీయ వైద్య విద్యార్థులను ఉద్యమంలో భాగం చేయడంలో కీలకంగా వ్యవహరించారన్నారు. మలిదశ ఉద్యమంలోనూ పాల్గొన్న కొల్లూరి త్వరగా కోలుకోవాలని ఈటల ఆకాంక్షించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని