KTR: దశాబ్దాల సమస్యలు.. ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం: కేటీఆర్

కేసీఆర్‌ వంటి నాయకుడి వల్లే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. బేగంపేటలో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ‘మహా పరినిర్వాణ’ (వైకుంఠధామం)ను మంత్రి ప్రారంభించారు. 

Published : 09 May 2023 19:31 IST

హైదరాబాద్‌: కేసీఆర్‌ వంటి నాయకుడి వల్లే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ బేగంపేటలో అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ‘మహా పరినిర్వాణ’ (వైకుంఠధామం)ను మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ పంద్రాగస్టు నాటికి నగరంలో మురుగునీటిని పూర్తిగా శుద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. నోటికొచ్చినట్లు విమర్శలు చేయడం తేలికేనని.. మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తించాలని ఆయన హితవు పలికారు. హైదరాబాద్‌ను ప్రపంచపటంలో నిలిపేలా కృషి చేస్తున్న కేసీఆర్‌, భారాసలను మరోసారి గెలిపించాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు